Poples Voice
Date of Publish : 14/11/2026, 8:16 pm
Published by PEOPLES VOICE

నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు

  • ప్రజా సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం
  • నాలుగున్నర లక్షల మందికి సామాజిక పింఛన్లు మంజూరు చేశాం: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్

నెహ్రూ జయంతి సందర్భంగా ఘన నివాళులు

చింతకాని, నవంబర్ 14 (పీపుల్స్ వాయిస్):
భారత తొలి ప్రధానమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్, మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కన్నెబోయిన గోపి యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా నాలుగున్నర లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు సామాజిక పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.ఈనెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రతి కుటుంబానికి భరోసా కల్పించేలా ఇందిరా జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు కూరపాటి కిషోర్, బందెల నాగార్జున, సట్టు వెంకటేశ్వర్లు, ఇనుకుల్ల నాగసూరారెడ్డి, ఆలస్యం బసవయ్య, ఎస్కే కాసిం, పర్సగాని సతీష్, లింగం రాంబాబు, యడ్లపల్లి శ్రీనివాసరావు, శీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save