Poples Voice
Date of Publish : 16/11/2026, 6:08 pm
Published by PEOPLES VOICE

జర్నలిస్టుల డిమాండ్లకు PDSU మద్దతు! PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్

జర్నలిస్టుల డిమాండ్లకు PDSU మద్దతు!

ఇళ్ల స్థలాలు కేటాయించాలి.. పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలి

ప్రభుత్వం జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి: PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ వంగూరి
ఖమ్మం, నవంబర్ 16 (పీపుల్స్ వాయిస్):

ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని PDSU (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ వంగూరి డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ జర్నలిస్టులు చేపట్టిన ధర్నాకు ఆయన సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా వెంకటేష్ వంగూరి మాట్లాడుతూ.. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తున్న జర్నలిస్టులు అనేక ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. జర్నలిస్టులకు సొంత ఇల్లు కల్పించే దిశగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.అలాగే, ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల కారణంగా జర్నలిస్టుల పిల్లల విద్యాభ్యాసం ఆర్థిక భారంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. విద్య అనేది వ్యాపార వస్తువు కాదని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం వారు చేస్తున్న పోరాటానికి PDSU ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జర్నలిస్టుల న్యాయమైన పోరాటాలకు విద్యార్థి సమాజం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని వెంకటేష్ వంగూరి స్పష్టం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save