Poples Voice
Date of Publish : 17/11/2026, 5:56 pm
Published by PEOPLES VOICE

డిసెంబర్ 29న ప్రజా గర్జనను జయప్రదం చేయండి _ సి వై పుల్లయ్య

డిసెంబర్ 29న ప్రజా గర్జనను జయప్రదం చేయండి⁰

ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సి వై పుల్లయ్య పిలుపు

ఖమ్మం రూరల్, నవంబర్ 17 (పీపుల్స్ వాయిస్):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రజా గర్జన ప్రదర్శన, బహిరంగ సభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సీహెచ్ పుల్లయ్య పిలుపునిచ్చారు.మంగళవారం ఖమ్మం రూరల్ మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం గుడుచుట్టు మాధవరావు అధ్యక్షతన ఎం. వెంకటాయపాలెంలోని అమరుడు గంగవరపు శ్రీనివాసరావు స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ.. దేశంలోని కీలక వనరులు, సంపదను అదానీ, అంబానీ వంటి దేశీయ బడా కార్పొరేట్ సంస్థలతో పాటు విదేశీ కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు.పార్టీ డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో దళితులు, మైనార్టీలు, పేద వర్గాలకు చెందిన ప్రజల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సుమారు 13 కోట్ల 40 లక్షల ఓట్ల తొలగింపు చర్యలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పార్టీ జిల్లా నాయకులు మలీదు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పేరుతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు కార్డులు అందించినప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మినహా మిగిలిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం ఆపాలని, అటవీ, రెవెన్యూ అధికారుల అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ఎడ్లపల్లి ఉపేందర్, నాయకులు కుర్ర వెంకన్న, రెంటాల యాదగిరి, వీర్ల వెంకట అప్పారావు, శీలం పూలమ్మ, బందెల లలిత, కందుల స్వామి, శీలం లెనిన్, కూసా మోహన్ రెడ్డి, అవిరేణి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save