Poples Voice
Date of Publish : 17/11/2026, 7:12 pm
Published by PEOPLES VOICE

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి

_విద్యార్థినుల పట్ల అసభ్యకర ప్రవర్తన, పరీక్ష ఫీజుల వసూళ్లలో ఇబ్బందులపై ఆరోపణలు

_అడిషనల్ కలెక్టర్ శ్రీజకు ఫిర్యాదు చేసిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

కల్లూరు, నవంబర్ 17 (పీపుల్స్ వాయిస్):

కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వేముల శేఖర్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలైన పీడీఎస్‌యూ, ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ వేముల శేఖర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ పరీక్ష ఫీజులు చెల్లించుకునే విషయంలో ఇబ్బందులు కల్పిస్తున్నారని, ఫీజుల చెల్లింపు పేరుతో గదికి పిలిపించి విద్యార్థినుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని అడిషనల్ కలెక్టర్‌కు వివరించినట్లు తెలిపారు.ఈ వ్యవహారంపై స్పందించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అడిషనల్ కలెక్టర్ శ్రీజను కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి టి. లక్ష్మణ్, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి బెజవాడ సాయి శేషు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు భూక్య బాలాజీ నాయక్, ఏఐఎస్ఏ జిల్లా సహాయ కార్యదర్శి అభిషేక్, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు నవీన్, శశి తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save