Poples Voice
Date of Publish : 18/11/2026, 9:50 am
Published by PEOPLES VOICE

వందనం గ్రామంలో ఇందిరమ్మ ‘చేయూత’ పింఛన్ పత్రాల పంపిణీ

  • తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ‘చేయూత’ పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు
  • ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో అర్హులైన ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు
  • చింతకాని మండలం వందనం గ్రామంలో పొన్నం నాగమణి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మంజూరు పత్రాల పంపిణీ
  • కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, ఎస్.కె. పాషా, పొన్నం చిన్న శంకర్ రావు, ఎస్.కె. మొయిన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

వందనం గ్రామంలో ఇందిరమ్మ ‘చేయూత’ పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ

కొత్తగా మంజూరైన పింఛన్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేత

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో అర్హులకు పింఛన్లు

ఖమ్మం, నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ‘చేయూత’ పింఛన్ పథకంలో కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం చింతకాని మండలం వందనం గ్రామంలో నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో అర్హులైన ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో వారికి మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామానికి చెందిన పొన్నం నాగమణి ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు ఎస్.కె. పాషా, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నం చిన్న శంకర్ రావు, ఉపాధ్యక్షులు ఎస్.కె. మొయిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అర్హులైన ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు కావడం ద్వారా వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save