నవంబర్ 30న ఐక్య క్రిస్మస్ ఆరాధన
జయప్రదం చేయాలని క్రైస్తవ నాయకులకు పిలుపు
ఐక్య క్రిస్మస్ ఆరాధన కరపత్రాలు ఆవిష్కరణ
ఖమ్మం, నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నవంబర్ 30న అల్లీపురంలోని దైవకృప ఆశ్రమంలో నిర్వహించనున్న ఐక్య క్రిస్మస్ ఆరాధనను జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు వేముల సత్యం నివాసంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నవంబర్ 30, 2026 సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐక్య క్రిస్మస్ ఆరాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవ సందేశాన్ని అందించేందుకు డాక్టర్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్న బాబు, జాయింట్ డైరెక్టర్ (బి.ఓ.యు.ఐ) ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న క్రైస్తవ నాయకులు, పాస్టర్ ఫెలోషిప్ నాయకులు, క్రైస్తవ విశ్వాసులు వేలాదిగా తరలివచ్చి ఐక్య క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. క్రైస్తవుల ఐక్యత, ఆధ్యాత్మిక సమైక్యతను చాటిచెప్పేలా ఈ ఆరాధనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు వేమన సత్యం, ఐక్యవేదిక అధ్యక్షులు రెవరెండ్ రాధాకృష్ణ, జాయింట్ సెక్రటరీ పాస్టర్ ఆర్. కుమార్, ట్రెజరర్ పాస్టర్ సామ్యూల్ రాజు, ప్రసార కార్యదర్శి బ్రదర్ డి. రాంబాబు, పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ విజయకుమార్, ఖమ్మం పట్టణ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.