Poples Voice
Date of Publish : 18/11/2026, 9:03 pm
Published by PEOPLES VOICE

నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం

నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం

15 దుప్పట్లు విరాళంగా అందించిన వనమా ట్రస్ట్ అధినేత వనమా సూరి

 ఖమ్మం, నవంబర్ 18 (పీపుల్స్ వాయిస్)

నిరుపేదలకు చేయూతనందించే లక్ష్యంతో వాసవి చిరు వ్యాపార సంఘం ఆధ్వర్యంలో త్వరలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సేవా కార్యక్రమానికి వనమా ట్రస్ట్ అధినేత వనమా సూరి 15 దుప్పట్లను విరాళంగా అందజేశారు.ఈ మేరకు సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవికి దుప్పట్లను అందించారు. రానున్న రోజుల్లో వీటిని అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్యవైశ్య మహాసభ మాజీ ఉపాధ్యక్షులు అనిల్, ఆర్యవైశ్య నాయకులు విన్నమూరి సుబ్బారావు, కొంకిమళ్ళ మృత్యుంజయరావు, స్వాతి హాస్పిటల్, వినాయక హాస్పిటల్ అధినేత పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవి మాట్లాడుతూ, నిరుపేదలకు సహాయం అందించాలనే సంకల్పంతో 15 దుప్పట్లు విరాళంగా అందించిన వనమా సూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.నిరుపేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న వాసవి చిరు వ్యాపార సంఘం కృషిని పలువురు అభినందించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save