Poples Voice
Date of Publish : 19/11/2026, 8:52 pm
Published by PEOPLES VOICE

వేపకుంట్లలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీల సమావేశాలు _ సీవై పుల్లయ్య

వేపకుంట్లలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీల సమావేశాలు

సమావేశాల్లో పాల్గొని ప్రసంగించిన జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధుల హాజరు

ఖమ్మం, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రఘునాథపాలెం మండల కమిటీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ కమిటీ, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ కమిటీల సమావేశాలు ఖమ్మం జిల్లా వేపకుంట్ల గ్రామంలోని రాయల సుభాష్ చంద్రబోస్ స్మారక భవనంలో నిర్వహించారు.ఈ సమావేశాల్లో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్, కోలేటి నాగేశ్వరరావు, బందెల వెంకయ్య, పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టీ. ఝాన్సీ, ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. శిరోమణి, పార్టీ రఘునాథపాలెం మండల కార్యదర్శి కేలోత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save