Poples Voice
Date of Publish : 19/11/2026, 8:57 pm
Published by PEOPLES VOICE

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి

గాంధీనగర్ కాలనీలో ఘనంగా వివాహ వేడుక

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి

 కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రుల సందడి

చింతకాని, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్ కాలనీలో కోసూరి వీరబాబు – లలిత దంపతుల కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. వారి కుమారుడు వెంకట సాయి గౌడ్, ఉమా గౌడ్‌ల వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఇంటి ఆవరణలో వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు వైరా మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి, తిరుమలాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, బొప్పారం గ్రామ సర్పంచ్ షేక్ రహమతుల్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన వధూవరులను పూలమాలలతో అభినందించి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save