Poples Voice
Date of Publish : 19/11/2026, 9:18 pm
Published by PEOPLES VOICE

ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి _ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్

ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి

చింతకాని మండల కేంద్రంలో జయంతి వేడుకలు.. నివాళులర్పించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్

చింతకాని, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
 భారత ఉక్కు మహిళ, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చింతకాని మండల కేంద్రంలోని ఆమె విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్నక శ్రీనివాసరావు, కొప్పుల గోవిందరావు, సర్పంచ్ కిలారి మనోహర్, దేవస్థానం చైర్మన్ ఎడ్లపల్లి శ్రీనివాసరావు, లోయ ఉపేందర్, ఏఎంసీ డైరెక్టర్లు బందెల నాగార్జున, ఎస్.కె. కాసిం, నాయకులు ఆలస్యం బసవయ్య, బండి సైదేశ్వరరావు, రమేష్, సట్టు వెంకటేశ్వర్లు, పెంటేల అప్పారావు, అజయ్, పర్సగాని సతీష్, చిన్నప్ప, సుభాని, బ్రహ్మచారి, రాము, లెనిన్ బాబు, శీలం శీను, జోగారావు, వెంకటేశ్వర్లు, రాజేష్, వెంకటేష్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save