Poples Voice
Date of Publish : 21/11/2026, 7:52 am
Published by PEOPLES VOICE

డీఈఓ వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు

డీఈఓ వాసంతిని మర్యాదపూర్వకంగా కలిసిన పీఆర్టీయూ టీఎస్ నాయకులు
ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అంశాలపై చర్చ

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

పీఆర్టీయూ టీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆర్. రంగారావు, ప్రధాన కార్యదర్శి గోరంట్ల విజయ అమృత్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు జిల్లా విద్యాశాఖాధికారిణి డి. వాసంతిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలు, విద్యారంగ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై డీఈఓతో చర్చించారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్. బ్రహ్మారెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్, జిల్లా ఆడిట్ కమిటీ చైర్మన్ రెబ్బా శ్రీనివాసరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు టి. రత్నకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీరా సోమ్లా, తల్లాడ మండల అధ్యక్షులు అద్దంకి గోపాలకృష్ణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save