Poples Voice
Date of Publish : 21/11/2026, 7:54 am
Published by PEOPLES VOICE

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట!

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థుల పతకాల పంట!

5వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో 10 పతకాలు కైవసం

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

5వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 10 పతకాలు సాధించారు. నవంబర్ 15, 2026న హన్మకొండ జిల్లా కాజీపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ అక్షర హైస్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీల్లో పి. అక్షిత్, ఎం. దేవాన్ష్ రామ్, బి. దయాన అద్వైత్ బంగారు పతకాలు సాధించగా, జైత్ర యాదవ్, రిషిత, జయదేవ్, సత్య సందేశ్, కార్తికేయ, నరేన్ చౌదరి, సాయి సుదీక్ష వెండి పతకాలు సాధించారు.పతకాలు సాధించిన విద్యార్థులను ఏజీఎం రాంకీ, ఆర్.ఐ. క్రాంతి కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జి. నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల విజయంపై కరాటే కోచ్ ఉపేందర్‌తో పాటు పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save