Poples Voice
Date of Publish : 21/11/2026, 2:26 pm
Published by PEOPLES VOICE

కోర్టు ఉత్తర్వులకే బేఖాతరా..? 85 ఏళ్ల వృద్ధురాలి ఆచూకీ ఏదీ.. వారసత్వ భూములపై మ్యుటేషన్ యత్నాలా!

కోర్టు ఉత్తర్వులున్నా వారసత్వ భూముల మ్యుటేషన్‌కు యత్నాలు!

85 ఏళ్ల వృద్ధురాలి అదృశ్యం, 20 కాసుల బంగారం మాయంపై బాధితురాలి ఆరోపణలు

వేంసూరు, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

కుటుంబ వారసత్వ భూముల వివాదం వేంసూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. భూములను ఇతరులకు బదలాయించరాదంటూ హైకోర్టు, సివిల్ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మ్యుటేషన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితురాలు ఆరోపించింది. తన 85 ఏళ్ల వృద్ధ తల్లి అదృశ్యమవడంతో పాటు ఆమె వద్ద ఉన్న సుమారు 20 కాసుల బంగారం మాయమైందని ఆవేదన వ్యక్తం చేసింది.అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భవాని, ఆమె భర్త ఆర్చేపల్లి వేణు, ఆర్చేపల్లి మధుసూదన్ తదితరుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. తల్లి నుంచి ఒత్తిడితోలేదామోసపూరితంగా వేలిముద్రలు సేకరించి ఆస్తుల లావాదేవీలు చేపడితే అంగీకరించబోమని హెచ్చరించింది.ఈ భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో W.P.No.38601/2026, సివిల్ కోర్టులో O.S.No.36/2026, I.A.No.3/2026 ద్వారా న్యాయపరమైన ఉత్తర్వులు పొందినట్లు బాధితురాలు తెలిపింది. కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.వృద్ధురాలి ఆచూకీ కనుగొని తనకు అప్పగించాలని, బంగారం మాయమైనట్లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. అవసరమైతే పోలీసులను ఆశ్రయించి న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన సహకారం అందించిన న్యాయవాది కొమ్మినపల్లి నాగపుష్పవతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save