Poples Voice
Date of Publish : 21/11/2026, 6:04 pm
Published by PEOPLES VOICE

44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై విస్తృత ప్రచారం!

 44వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై విస్తృత ప్రచారం!

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా – గడపగడపకూ వెళ్లి అవగాహన కల్పించిన గుడిపూడి జగదీష్

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ఖమ్మం నగరంలోని 44వ డివిజన్‌లో కాంగ్రెస్ నాయకులు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకంపై ప్రజలకు వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, ఖమ్మం అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆదేశాల మేరకు 44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ పథకం ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో డిసెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద సంబంధిత అధికారులకు అవసరమైన పత్రాలు అందజేసి నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల తిరుమలరావు, మైనారిటీ నాయకులు ఎస్.కె. హుస్సేన్, మహిళా నాయకురాళ్లు, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save