Poples Voice
Date of Publish : 21/11/2026, 6:08 pm
Published by PEOPLES VOICE

కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య

కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!

సంతాప సభలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య

కామేపల్లి, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

కామేపల్లి మండలం కొత్త లింగాల గ్రామానికి చెందిన సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ సీనియర్ నాయకుడు, ప్రజా ఉద్యమాల సహచరుడు కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై. పుల్లయ్య అన్నారు.కొత్త లింగాల గ్రామంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో  సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ కామేపల్లి–కారేపల్లి సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఎన్.వి. రాకేష్ అధ్యక్షతన కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య సంతాప సభ నిర్వహించారు. తొలుత నాయకులు, కార్యకర్తలు సర్వన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా సి.వై. పుల్లయ్య మాట్లాడుతూ.. కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో, ఎర్రజెండా పట్ల అచంచల విశ్వాసంతో పనిచేశారని కొనియాడారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణానికి, ప్రజా ఉద్యమాల బలోపేతానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. వయసు పైబడినా, అనారోగ్య సమస్యలు ఎదురైనా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.మేడే కార్యక్రమాలు, అమరవీరుల సభలు, పార్టీ మహాసభలు, వివిధ ప్రజా ఉద్యమాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సర్వయ్య మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన సాధారణ కార్యకర్తల కృషి, త్యాగాల పునాదులపైనే కమ్యూనిస్టు ఉద్యమాలు నిలబడతాయని అన్నారు.కామ్రేడ్ సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత బలోపేతం చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పుల్లయ్య పిలుపునిచ్చారు.ఈ సంతాప సభలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల అశోక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాటోత్ కృష్ణ, ఖమ్మం డివిజన్ కార్యదర్శి టీ. ఝాన్సీ, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శివలింగం, ఎస్.కే. లాల్ మియా, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు ఎడ్లపల్లి ఉపేందర్, కేలోతు లక్ష్మణ్, మండల నాయకులు వడ్డే వెంకటేశ్వర్లు, ధరావత్ సక్రు, జరుకుల రామ్‌సింగ్, వీరయ్య, రాజేష్, సక్రం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొని కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్యకు ఘనంగా నివాళులర్పించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save