Poples Voice
Date of Publish : 21/11/2026, 7:22 pm
Published by PEOPLES VOICE

మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం!

  • వారాంతపు, పండుగ సెలవులు.. రక్షణ పరికరాలు, పనిముట్లు అందజేతకు హామీ – ఒప్పందాలు ఉల్లంఘిస్తే సమ్మె తప్పదు: CITU–TUCI–AITUC

మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం!

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం!

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ CITU, TUCI, AITUC సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రెండో రోజు ధర్నాలో అధికారుల నుంచి పలు డిమాండ్లకు హామీ లభించింది. వారాంతపు, పండుగ సెలవులు మంజూరు చేయడంతో పాటు రక్షణ పరికరాలు, పనిముట్లు అందజేయడానికి అధికారులు అంగీకరించారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా CITU జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, TUCI జిల్లా కార్యదర్శి జి. రామయ్య, AITUC జిల్లా నాయకులు పగడాల మల్లేష్ మాట్లాడుతూ.. డ్రైవర్లకు సెకండ్ కేటగిరీ వేతనాలు అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, జీతాలు సక్రమంగా చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుదిరిన ఒప్పందాలను అధికారులు ఉల్లంఘిస్తే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జినక శ్రీను, దొడ్డా నరసింహారావు, దున్న గురువయ్య, నారాయణ, రవి, రాధమ్మ, తురక నాగేశ్వరరావు, కృష్ణ, విజయ, పద్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ CITU, TUCI, AITUC సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రెండో రోజు ధర్నాలో అధికారుల నుంచి పలు డిమాండ్లకు హామీ లభించింది. వారాంతపు, పండుగ సెలవులు మంజూరు చేయడంతో పాటు రక్షణ పరికరాలు, పనిముట్లు అందజేయడానికి అధికారులు అంగీకరించారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా CITU జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, TUCI జిల్లా కార్యదర్శి జి. రామయ్య, AITUC జిల్లా నాయకులు పగడాల మల్లేష్ మాట్లాడుతూ.. డ్రైవర్లకు సెకండ్ కేటగిరీ వేతనాలు అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, జీతాలు సక్రమంగా చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుదిరిన ఒప్పందాలను అధికారులు ఉల్లంఘిస్తే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జినక శ్రీను, దొడ్డా నరసింహారావు, దున్న గురువయ్య, నారాయణ, రవి, రాధమ్మ, తురక నాగేశ్వరరావు, కృష్ణ, విజయ, పద్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save