Poples Voice
Date of Publish : 21/11/2026, 7:28 pm
Published by PEOPLES VOICE

కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి

కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి!

డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి – సానుకూలంగా స్పందించిన అధికారి, త్వరలోనే కార్డులు జారీ చేస్తామని హామీ

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లాలో కేబుల్ న్యూస్ ఛానళ్లలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన రిపోర్టర్లకు తక్షణమే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి గౌస్ పాషాను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తున్న విషయాన్ని డీపీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలోనూ అర్హులైన రిపోర్టర్లకు కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న శాటిలైట్ ఛానళ్ల జర్నలిస్టుల దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇటీవల అక్రెడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు సైతం తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

టీజేఎఫ్ నాయకుల వినతిపై డీపీఆర్ఓ గౌస్ పాషా సానుకూలంగా స్పందిస్తూ, పెండింగ్‌లో ఉన్న అక్రెడిటేషన్ కార్డుల మంజూరుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజనీకాంత్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి బిక్కి గోపి, జిల్లా నాయకులు వనం నాగయ్య, శ్రీధర్ శర్మ, కొమెర వెంకటేశ్వర్లు (కె.వి.), మందా మోహన్, మందుల ఉపేందర్, పిన్నెల్లి శ్రీనివాస్, సతీష్, కూరపాటి నరేష్, మస్తాన్, ముక్కంటి, పెంటి వెంకటేశ్వర్లు, కిరణ్మయి, సంపత్ కుమార్, నాగశేఖర్, మధు, శ్రీను తదితరులతో పాటు పలువురు కేబుల్ ఛానళ్ల రిపోర్టర్లు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save