మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి!
కొత్తగూడెంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ కొత్తగూడెంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మత్స్యకారులు, ముదిరాజ్ మహాసభ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఐ కొత్తగూడెం శాఖ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు జెండా ఆవిష్కరించారు.అనంతరం నిర్వహించిన సభలో రావుల హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు పగడాల మల్లేష్, మాజీ కార్పొరేటర్ కొప్పెర ఉపేందర్ మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం, ముదిరాజ్ సమాజ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత చేయూత అందించాలని, కులవృత్తులను కాపాడుకుంటూనే యువత విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు లింగనబోయిన లక్ష్మణ్, పగడాల అనంతరాములు, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు అక్కి కోటయ్య, కార్యదర్శులు నర్రా శ్రీను, చింతల వెంకన్న, యువజన అధ్యక్షులు పొన్నెబోయిన సాయి, జిల్లా నాయకులు తిప్పట్ల నర్సింహారావు, లింగనబోయిన సతీష్, తవడబోయిన కృష్ణ, వెంగంపల్లి సురేష్, అరిగె నాగేశ్వరరావు, కుడితి సురేష్, బోనకల్ మండల అధ్యక్షులు రెడ్డెబోయిన ఉర్ధండు, మత్స్యశాఖ కార్యదర్శి పోతల నర్సింహారావు, అధ్యక్షులు మద్దరబోయిన అప్పారావు, కొత్తగూడెం అధ్యక్షులు బుడిగె వెంకన్న, కార్యదర్శి రావుల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.