Poples Voice
Date of Publish : 21/11/2026, 7:34 pm
Published by PEOPLES VOICE

జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి!

జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి!

రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన జనసేన నాయకులు

ఖమ్మం, నవంబర్ 21 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు మాటేటి రవి జనసేన పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర నాయకులు రాము యాదవ్, గంగిశెట్టి వెంకటేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ నాయకులు తాళ్లూరి రాము, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడల శ్రీనివాస్ సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాటేటి రవి మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పార్టీలో చేరేందుకు అవకాశం కల్పించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save