Poples Voice
Date of Publish : 23/11/2026, 10:03 am
Published by PEOPLES VOICE

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం

దశలవారీ ఆందోళనలో భాగంగా TUWJ (TJF) ఖమ్మం జిల్లా కమిటీ కార్యక్రమం

ఖమ్మం, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ TUWJ (TJF) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సోమవారం ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద ప్రారంభించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save