ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం
ఆర్‌జేసీ కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు రామ్మూర్తి చేతుల మీదుగా సత్కారం
వైరా, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
తెలంగాణ గురుకులాల మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ మాజీ అదనపు డీజీపీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా వైరా మండల కేంద్రంలో నిర్వహించిన ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన మిట్టపల్లి కిషోర్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు రామ్మూర్తి పాల్గొని మిట్టపల్లి కిషోర్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.