జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
హైదరాబాద్, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
అంబర్‌పేటలో గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్టు వనం వెంకటరమణకు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటరమణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, జర్నలిస్టులకు ఉచిత వైద్యం, పింఛన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.