Poples Voice
Date of Publish : 24/11/2026, 8:32 am
Published by PEOPLES VOICE

అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత _ నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత

అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత

నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత

నేలకొండపల్లి, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
అయ్యప్ప మాలధారణ భక్తులకు గురుస్వామి బీ. ఉపేందర్ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి కర్నాటి కృష్ణయ్య నగర్ కాలనీ వాసులు రూ.10 వేల విరాళం అందజేశారు. కాలనీ ప్రతినిధి మారిశెట్టి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఈ విరాళాన్ని ఉపేందర్‌కు అందించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ అన్నదాన సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగుతుందని గురుస్వామి ఉపేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, అయ్యప్ప గురుస్వాములు, మాలధారణ భక్తులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save