Poples Voice
Date of Publish : 24/11/2026, 8:41 am
Published by PEOPLES VOICE

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి _ కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి

జిల్లా కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి

ఖమ్మం, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జీ. నాగస్వామి మాట్లాడుతూ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతున్న అర్హులైన జర్నలిస్టులకు గతంలో కేటాయించిన భూమిని పంపిణీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తక్షణమే జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం. మణికుమార్, కార్యదర్శి మత్తి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాసీం, ట్రెజరర్ బోడపట్ల సతీష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం.డి. రషీద్, కార్యదర్శి ఎం. చిన్ని, జిల్లా నాయకులు నల్లమోతు శ్రీనివాసరావు, గంజికుంట్ల వెంకన్న, వాసం రాజేంద్రప్రసాద్, కొత్త వెంకన్న, పామర్తి నాగేశ్వరరావు, వి. మోహన్ రావు, మల్లెబోయిన లక్షయ్య తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save