Poples Voice
Date of Publish : 26/11/2026, 7:22 am
Published by PEOPLES VOICE

సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు

సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు

రౌడీయిజాన్ని ప్రోత్సహించేలా రీల్స్.. మారణాయుధాలు స్వాధీనం

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: రఘునాథపాలెం పోలీసులు

ఖమ్మం, నవంబర్ 25 (పీపుల్స్ వాయిస్):
 సోషల్ మీడియాలో మారణాయుధాలను ప్రదర్శిస్తూ, రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా వీడియోలు, రీల్స్ పోస్టు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వ్యక్తిపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల సోషల్ మీడియా పర్యవేక్షణలో భాగంగా 'Mohammadthgur' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను గుర్తించారు. సదరు ఖాతాలో కత్తులు ప్రదర్శిస్తూ వీడియోలు పోస్టు చేయడంతో పాటు, గ్యాంగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు, రౌడీగా తనను తాను చిత్రీకరించుకుంటూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా రీల్స్ అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అతని గత నేర చరిత్రపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా మారణాయుధాలను ప్రదర్శించినా, రౌడీయిజాన్ని ప్రోత్సహించే పోస్టులు పెట్టినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రఘునాథపాలెం పోలీసులు హెచ్చరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save