ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా
ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు కార్యక్రమంలో ఆయన డివిజన్ మాజీ కార్పొరేటర్ లకావత్ సైదులు నాయక్, కమర్తపు మురళితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు అధికారి వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు నారపోగు సుదర్శన్, పాలకుర్తి నాగేశ్వరరావు, ఎస్.కె. రంజన్, ట్రాక్టర్ వెంకన్న, కమటం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.