నూతన వధూవరులను ఆశీర్వదించిన కన్నెబోయిన గోపి యాదవ్
ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన మాగం కొండలరావు–వరలక్ష్మి దంపతుల కుమారుని వివాహ వేడుకలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్తిని వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాస్ యాదవ్, బుర్ర ముత్తయ్య, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య తదితరులు పాల్గొని నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.