Poples Voice
Date of Publish : 26/11/2026, 7:31 am
Published by PEOPLES VOICE

చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం

చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం

చింతకాని, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకొని చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొండా గోపి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొండా వెంకన్న, నాయకులు బొర్రా శ్రీను, అంజన సిద్ధార్థ యాదవ్, సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save