Poples Voice
Date of Publish : 26/11/2026, 8:20 pm
Published by PEOPLES VOICE

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. బ్రెయినీ స్టార్స్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. బ్రెయినీ స్టార్స్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మంలోని వీడీఓస్ కాలనీ, గట్టయ్య సెంటర్‌లో ఉన్న బ్రెయినీ స్టార్స్ మాంటిస్సోరి పాఠశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జైనుల్ పాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాన్ని కల్పిస్తుందని వివరించారు. ప్రపంచంలోనే విశిష్టమైన లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం ఒకటని, ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు.విద్యార్థులు చిన్నతనం నుంచే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను అలవర్చుకోవాలని, కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.అనంతరం ఉపాధ్యాయులు రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యతను, రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలను తమ జీవితాల్లో పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ, నీలిమ, నాగమణి, మాధవి, అబ్బాసీ, సల్మా, కలైవాణి, కళ్యాణి, రజియా తదితరులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save