ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన
ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా వన సమారాధన కార్యక్రమాన్ని బుధవారం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ మున్నేరు బ్రిడ్జి సమీపంలోని మామిడి తోటలో ఘనంగా నిర్వహించారు. జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆత్మీయ సత్కారాలతో సందడిగా సాగాయి.ఈ సందర్భంగా మహిళలకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆకుల గణపతిరాజు తన పాటలతో సభికులను అలరించగా, మిమిక్రీ కళాకారులు వివిధ సన్నివేశాలు, పాటలతో వినోదాన్ని పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ సేవా దృక్పథాన్ని పలువురు కొనియాడారు.అనంతరం సంఘం కార్యవర్గ సభ్యులతో పాటు 70 నుంచి 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధ సభ్యులను, వారి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతల్లో సాధినేని జనార్ధన్ రావు దంపతులు, వై. కుటుంబరావు దంపతులు, వేగినాటి లక్ష్మయ్య, ఆకుల లక్ష్మీనారాయణ, మేకల భిక్షమయ్య, వల్లాల నమశ్శివాయ, ఆకుల గజపతిరాజు, షేక్ హుస్సేన్, రాములు, విశ్వనాథం, కృష్ణమాచార్యులు, దుగ్గినేని శ్రీనివాసరావు, పొదిల రామనారాయణ, సముద్రాల సత్యనారాయణ, హుండీల రాజారావు, సాధినేని రాఘవయ్య, కృష్ణమూర్తి, జగన్మోహన్ రావు, రంగస్వామి, మురళి, రవీందర్ రావు, నారాయణరెడ్డి, ఇబ్రహీం, ఉపేందర్, సాంబశివరావు, రాయల వెంకటేశ్వర్లు, జి. నాగభూషణం, కటకం పిచ్చయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్, డాక్టర్ వెలిగేటి విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి జనార్ధన్ రావు, కోశాధికారులు కె. సత్యనారాయణ రెడ్డి, ఏ. గోవర్ధన్ రావు, కె. దాసు, నరసయ్య, కోమటి లింగమూర్తి, జిల్లా కార్యదర్శి జెల్లా వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మూలగుండ్ల శ్రీహరి, సభ్యులు డాక్టర్ బి. సుశీల, జె. ఉపేందర్ రెడ్డి, ఆంజనేయులు, సుధాకర్, షేక్ యాకూబ్ బేగ్, లక్ష్మయ్య, మేకల భిక్షమయ్య, తాత రాఘవయ్య, రాయల వెంకటేశ్వర్లు, రామారావు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ సంఘం సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి భారీ సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.