ఆర్యవైశ్యుల వనసమారాధనను విజయవంతం చేయండి!
జిల్లా నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలిరావాలి
ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్
ఖమ్మం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):
ఖమ్మం నగరంలో ఆదివారం చెరుకూరి మామిడి తోటలో ఆర్యవైశ్య సంఘం, వాసవి కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆర్యవైశ్యుల వనసమారాధన (వనభోజనాల) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గుమ్మడవెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సోదర సోదరీమణులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆర్యవైశ్యుల మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి వనసమారాధన కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై సంఘీభావాన్ని చాటాలని, వనభోజనాల వేడుకను ఐక్యతకు ప్రతీకగా నిలిపేలా విజయవంతం చేయాలని గుమ్మడవెల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.