Poples Voice
Date of Publish : 28/11/2026, 9:31 pm
Published by PEOPLES VOICE

తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ

  • టీఎన్జీవోస్ అనుబంధ సంఘంగా గుర్తింపునకు అంగీకారం.. సభ్యులకు సభ్యత్వ రసీదుల అందజేత
  • – జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాగి వెంకన్న, బొమ్మెర ముత్యం

తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యత్వ పుస్తకాల ఆవిష్కరణ

ఖమ్మం, నవంబర్ 28 (పీపుల్స్ వాయిస్):

తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంప్లాయిస్ అసోసియేషన్‌ను టీఎన్జీవోస్ సంఘంలో అనుబంధ సంఘంగా చేర్చుకోవాలని కోరుతూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాగి వెంకన్న, కార్యదర్శి బొమ్మెర ముత్యం ఆధ్వర్యంలో ప్రతినిధులు టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావును టీఎన్జీవోస్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సంఘాన్ని టీఎన్జీవోస్‌లో అనుబంధ సంఘంగా చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు గుంటుపల్లి శ్రీనివాసరావు అంగీకారం తెలిపారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. తదుపరి సభ్యులకు తన చేతుల మీదుగా సభ్యత్వ రసీదులను అందజేశారు.

ఈ సందర్భంగా గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి టీఎన్జీవోస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సంఘ సభ్యులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఎన్జీవోస్‌ను మరింత బలోపేతం చేయడంలో సాంస్కృతిక సారథి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పమ్మి రవి, మిమిక్రీ సుధాకర్, మేడ ముత్తయ్య, కాల్వకట్ట జాన్, కోశాధికారి చాపలమడుగు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పరకాల అజయ్, సహాయ కార్యదర్శులు నకరికంటి వెంకటేశ్వర్లు, మాచర్ల కృష్ణ, బానోత్ రవి, మహిళా ప్రతినిధులు యంగల కుమారి, ముత్తమాల సునీత, ప్రచార కార్యదర్శి పిడియాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save