Poples Voice
Date of Publish : 20/10/2026, 3:55 pm
Published by Yakub Pasha

తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు

ధర్మమే అంతిమంగా విజయం సాధిస్తుంది.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు


 హైదరాబాద్ అక్టోబర్ 20 ( పీపుల్స్ వాయిస్ )


హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని విజయదశమి పండుగ సందేశమిస్తుందని పేర్కొన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ఈ పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

విజయదశమి సందర్భంగా రైతులకు మంచి పంటలు పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని, మహిళలు గౌరవం, భద్రతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

ప్రజలంతా ఐక్యత, సామరస్యంతో ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రం, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విజయదశమి స్ఫూర్తితో సత్యం, ధర్మం, న్యాయం పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save