దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రజల జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాలు నిండాలని ఆకాంక్ష
న్యూఢిల్లీ, అక్టోబర్ 20 (పీపుల్స్ వాయిస్):
విజయదశమి, దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయ పర్వదినం ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, శ్రేయస్సు, విజయాలు వెల్లివిరియాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయదశమి పండుగ సంతోషం, విశ్వాసంతో ప్రతి ఒక్కరి సంకల్పాలకు మరింత బలాన్ని అందించాలని ప్రధాని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున జరుపుకోనున్నారు
– వందే భారత్ హైదరాబాద్