దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చింతకాని, అక్టోబర్ 20 (పీపుల్స్ వాయిస్): దసరా పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాగులవంచలోని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా అంబటి వెంకటేశ్వర్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన చిన్నారులు ఉప ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలియజేయగా, ఆయన వారితో కొద్దిసేపు మాట్లాడి ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడుపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎస్‌కే కాసీం, బందెల నాగార్జున, నన్నాక శ్రీనివాసరావు, కూరపాటి కిశోర్, కొప్పుల గోవిందరావు, తిరుపతి యాదయ్య, అలస్యం బసవయ్య, నాగ సురారెడ్డి, నూతలపాటి వెంకటేశ్వర్లు, కంచం కోటేశ్వరరావు, నెల్లూరి కోటేశ్వరరావు, బొర్రా ప్రసాద్, ఆళ్ల పానకాలు, నాగులవంచ మాజీ సర్పంచ్ కంభం వీరభద్రం, ఆళ్ల శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, సర్పంచులు దుసరి నేతాజీ, కిలారి మనోహర్, ఆవుల నాగేశ్వరరావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కంచుమర్తి రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.