Poples Voice
Date of Publish : 21/10/2026, 1:20 pm
Published by PEOPLES VOICE

నాగులవంచ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా నూతన వస్త్రాల పంపిణీ

నాగులవంచ పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా నూతన వస్త్రాల పంపిణీ

చింతకాని, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్): నాగులవంచ గ్రామ పంచాయతీ సిబ్బందికి కాంగ్రెస్ జోనల్ కమిటీ నాయకులు ఆలస్యం బసవయ్య మంగళవారం నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. దసరా పండుగతో పాటు తన మనవడు శ్రేయన్స్ కార్తీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, ఉపసర్పంచ్ అంబటి శరత్ కుమార్, వార్డు సభ్యులు గువ్వల వీరదాసు, చెట్టిపోగు నరేష్, గంధం ఇందిరా, అన్నేపోగు రవి, గురజాల జయశంకర్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, కాంగ్రెస్ నాయకులు నారగాని శ్రీనివాసరావు, అంబాల వెంకన్న, ఆలస్యం కృష్ణకాంత్, మల్లెల వెంకన్న, కంభం శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save