Poples Voice
Date of Publish : 21/10/2026, 1:51 pm
Published by PEOPLES VOICE

బెదిరింపులపై ఆవేదన.. యువ న్యాయవాది మృతి

బెదిరింపులపై ఆవేదన.. యువ న్యాయవాది మృతి

రఘనాథపాలెం, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ. వెంకటాయపాలెంలో 27 ఏళ్ల జూనియర్ న్యాయవాది గణేశ్ మృతి విషాదం నింపింది. ఏడాది కాలంగా ఖమ్మం కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న గణేశ్ సోమవారం రాత్రి తన అమ్మమ్మ ఇంట్లో మృతి చెందాడు.

గత నాలుగు రోజులుగా ఎవరో తనను వెంబడిస్తున్నారని, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారని గణేశ్ చెప్పినట్లు అతడి తండ్రి దానయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తన కుమారుడు ఆందోళనకు గురైనట్లు ఆయన తెలిపారు.

సోమవారం రాత్రి గణేశ్ తన అన్న సాయితేజతో కలిసి అమ్మమ్మ పద్మావతి ఇంటికి వెళ్లాడు. అనంతరం పద్మావతి, సాయితేజ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి గణేశ్ మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గణేశ్ మృతికి దారితీసిన పరిస్థితులు, ఫోన్ బెదిరింపుల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save