Poples Voice
Date of Publish : 21/10/2026, 5:49 pm
Published by PEOPLES VOICE

ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల బరిలో IUML!

  • ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల బరిలో IUML!
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల బరిలో IUML!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

ఖమ్మం, అక్టోబర్ 21 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టనున్నట్లు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా తెలిపారు.

రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ మహమ్మద్ షకీల్ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా షేక్ బాజీ బాబా మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6వ తేదీ వరకు మాత్రమే ఓటు నమోదుకు అవకాశం ఉన్నందున ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పట్టభద్రులందరూ గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

ఓటు నమోదు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా, ఓటరు నమోదుకు సంబంధించి సలహాలు, సూచనలు కావాలన్నా 94911 29513 నంబర్‌ను సంప్రదించాలని షేక్ బాజీ బాబా విజ్ఞప్తి చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save