ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ విజయవంతంగా ముగింపు
ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ విజయవంతంగా ముగింపు కొత్త అధ్యక్షుడిగా నిర్భయ్ సింగ్ దుడికే.. ప్రధాన కార్యదర్శిగా జె.వి. చలపతిరావు ఎన్నిక రైతులు, వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపు ఖమ్మం, అక్టోబర్ 1 (ఆయుధం): ఏఐకేఎంఎస్ 4వ అఖిల భారత మహాసభ ఖమ్మంలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లోని కామ్రేడ్ అజ్మీర్ సింగ్ హాల్‌లో బుధవారం రాత్రి సుమారు 8.30 గంటలకు ముగిసింది. మహాసభలో కొత్త అధ్యక్షుడిగా కామ్రేడ్ నిర్భయ్ సింగ్ దుడికే, ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ జె.వి. చలపతిరావు ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన నాయకులు తమపై అప్పగించిన బాధ్యతలను స్వీకరిస్తూ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ భారతదేశంలో...