వందనం గ్రామంలో పాతిమ మాత నూతన దేవాలయానికి శంకుస్థాపన

వందనం గ్రామంలో పాతిమ మాత నూతన దేవాలయానికి శంకుస్థాపన చింతకాని, అక్టోబర్ 04 ( పీపుల్స్ వాయిస్ ): మండలంలోని వందనం గ్రామంలో పాతిమ మాత నూతన దేవాలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం 11.30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాష్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో విచారణ గురువు కిన్నెర రమేష్, ఉపదేశకులు తప్పెట స్లీవరాజు పాల్గొన్నారు. వందనం గ్రామ పెద్దలు అంకిరెడ్డి రాఘవరెడ్డి, సుంకు నాగి రెడ్డి, గొర్రెపాటి రామారావు, ఆవుల మల్లికార్జున తో పాటు సంఘ పెద్దలు, గ్రామస్తులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.