కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి ఎన్నికల కమిషన్‌లో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి చింతకాని, అక్టోబర్ 05 (పీపుల్స్ వాయిస్): ఇండియా కూటమి పిలుపు మేరకు చింతకాని మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ మండల కమిటీల ఆధ్వర్యంలో సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్, సీపీఐ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికల కమిషన్...