కఠిన సవాళ్లను అధిగమించిన రన్నర్ పిల్లి రాజుకు ఘన సన్మానం

కఠిన సవాళ్లను అధిగమించిన రన్నర్ పిల్లి రాజుకు ఘన సన్మానం ఖమ్మం అక్టోబర్ 09( పీపుల్స్ వాయిస్ ): వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా లకారం ట్యాంక్ వాకర్స్ క్లబ్, శ్రీ దుర్గ మహిళా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ రన్నర్, తెలంగాణ పోలీస్ అథ్లెట్ పిల్లి రాజును ఘనంగా సన్మానించారు. 100 కిలోమీటర్ల అల్ట్రా రన్‌తో పాటు లడఖ్‌లో 17,678 అడుగుల ఎత్తులో నిర్వహించిన 72 కిలోమీటర్ల Khardung La Challenge‌ను పూర్తి చేయడం అభినందనీయమని SUDHA చైర్మన్ దుర్గాప్రసాద్ కొనియాడారు. ప్రతికూల వాతావరణం, అత్యల్ప ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ మధ్య ఈ ఘనత సాధించడం ఖమ్మం జిల్లాకే గర్వకారణమన్నారు. “Run for...