ఆర్టీసీలో యూనియన్ విజయం _ ప్రలోభాలకు లొంగని కార్మికులు
ఆర్టీసీలో యూనియన్ విజయం ప్రలోభాలకు లొంగని కార్మికులు ఖమ్మం, అక్టోబర్ 10 (పీపుల్స్ వాయిస్): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు పనిచేసే సంఘానికే పట్టం కట్టారని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. కష్టకాలంలో కార్మికులకు అండగా నిలిచి, హక్కుల కోసం పోరాడిన సంఘానికి గుర్తింపు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలు ఎదురైనా కార్మికులు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. శుక్రవారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఎంప్లాయీస్ యూనియన్ కూటమి అభినందన సభ శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రావి శివరామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హేమంతరావు...