జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి ఇల్లందులో న్యూడెమోక్రసీ నిరసన

జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలి ఇల్లందులో న్యూడెమోక్రసీ నిరసన ఇల్లందు, అక్టోబర్ 10 ( పీపుల్స్ వాయిస్ ) : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని, ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులపై...