పోలవరం వరం కాదు.. తెలంగాణకు శాపం _ ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి

పోలవరం వరం కాదు.. తెలంగాణకు శాపం ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి ఖమ్మం, అక్టోబర్ 11 ( పీపుల్స్ వాయిస్ ) : పోలవరం ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురయ్యాయని, లక్ష మంది ఆదివాసులు నిర్వాసితులయ్యారని ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) జిల్లా ఆవిర్భావ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిజాం నవాబు రాముడికి గుడి కడితే జైశ్రీరామ్ అనే వారు.. ఇప్పుడు రాముడినే ముంచుతున్నారని, ఇది ఎంతమాత్రం సహించరానిదని యాదగిరి వ్యాఖ్యానించారు. తంగేడు పూలతో చెరువులు శుద్ధి అవుతాయని...