నాగులవంచ గడీ సెంటర్‌లో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు _ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన.. ఘనంగా గోపూజ, పంచహారతి, బతుకమ్మ సంబరాలు
నాగులవంచ గడీ సెంటర్‌లో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన.. ఘనంగా గోపూజ, పంచహారతి, బతుకమ్మ సంబరాలు చింతకాని, అక్టోబర్ 12 ( పీపుల్స్ వాయిస్ ) : నాగులవంచ గ్రామంలోని గడీ సెంటర్‌లో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, కనకదుర్గమ్మ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో గడీ సెంటర్ మార్మోగగా, ప్రత్యేక పూజలు, హారతులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యగారు దాములూరి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో గోపూజ, పంచహారతి, బతుకమ్మ సంబరాలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం శ్రీనివాసరావు–చిట్టెమ్మ, అంబటి రాజేంద్రప్రసాద్–శ్రీలక్ష్మి, ఆళ్ల మాధవరావు–అరుణ దంపతులు...