రైతులను తక్షణమే ఆదుకోవాలి

రైతులను తక్షణమే ఆదుకోవాలి ఎలినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి రైతులకు తీవ్ర నష్టం పశుగ్రాసాన్ని సబ్సిడీపై అందించాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చింతకాని, అక్టోబర్ 15 ( పీపుల్స్ వాయిస్): తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు కోడుమూరు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఎలినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలపై వర్షాభావ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు....