కిష్టారం ఓసీలో దుర్గామాతను దర్శించుకున్న ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు

కిష్టారం ఓసీలో దుర్గామాతను దర్శించుకున్న ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు కిష్టారం, అక్టోబర్ 16 ( పీపుల్స్ వాయిస్ ) : కిష్టారం ఓసీలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఐఎన్‌టీయూసీ సత్తుపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిష్టారం ఓసీ ఫిట్ సెక్రటరీ షణ్ముఖాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల జీవితాల్లో...