రేపల్లెవాడలో భూముల రీ-సర్వే కార్యక్రమం ప్రారంభం
రేపల్లెవాడలో భూముల రీ-సర్వే కార్యక్రమం ప్రారంభం చింతకాని, అక్టోబర్ 16 ( పీపుల్స్ వాయిస్ ) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం చింతకాని మండలం రేపల్లెవాడ గ్రామంలోని కంట మహేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభించారు. గ్రామంలోని భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూ రికార్డుల సర్వే ప్రక్రియను చేపట్టే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రేపల్లెవాడ సర్పంచ్ మడుపల్లి అంబికా రాంప్రసాద్, తహసీల్దార్ కరుణశ్రీ, సర్వేయర్ నవీన్, జీపీఓ కిరణ్, గ్రామ కార్యదర్శి రామారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మడిపల్లి భాస్కర్, బంధం కృష్ణ, మడిపల్లి కిరణ్ బాబు, బండి శ్రీనివాసరావు, మడిపల్లి...