తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఖమ్మం, అక్టోబర్ 18 ( పీపుల్స్ వాయిస్ ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయ ప్రాంగణం కనులవిందుగా మారింది. పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు ఆడుతూ, జానపద గేయాలతో పండుగ సందడిని మరింత పెంచారు. ప్రకృతిని ఆరాధించే పండుగ...